యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు

యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు

కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఇకపై యాంటీ ఎసిడిటీ మాత్రల షీట్లపై ‘మీ కిడ్నీకి ముప్పు’ అనే హెచ్చరిక ముద్రించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలు, యాంటాసిడ్‌ ఔషధ తయారీ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రజారోగ్య భద్రత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇకపై పాంటోప్రజోల్‌, ఓమెప్రజోల్‌, లాంసోప్రజోల్‌, ఎసోమేప్రజోల్‌ సహా ఆ కోవకు చెందిన ఎసిడిటీ నిరోధక మాత్రలపైనా ఈ హెచ్చరిక కనిపించనుంది. తరుచూ యాంటాసిడ్‌ మాత్రలను వాడేవారు కిడ్నీ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్‌ కేన్సర్‌ బారినపడుతున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైన నేపథ్యంలో కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది.

more updates »