'అల వైకుంఠపురములో' ఆ సీన్స్ హైలైట్ అంటా?

'అల వైకుంఠపురములో' ఆ సీన్స్ హైలైట్ అంటా?

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలా వరకూ చిత్రీకరించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సీన్స్ ఒక 10 నిమిషాలపాటు ఉంటాయట. ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఈ ఎమోషనల్ సీన్స్ ను త్రివిక్రమ్ హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించాడని అంటున్నారు. ప్రతి ఒక్కరి మనసులకు ఆ సీన్స్ కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, 'టబు' కీలకమైన పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతికి అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

more updates »