అమితాబ్ బచ్చన్ తొలి రెమ్మ్యూనరేషన్ ఎంతో తెలుసా?

అమితాబ్ బచ్చన్ తొలి రెమ్మ్యూనరేషన్ ఎంతో తెలుసా?

సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్.. ఈ పేరు తెలియని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. 1969లో సాత్ హిందుస్థానీతో మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. తొలి సినిమాకే ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నారు బిగ్ బీ. వెండితెరపై తానేమిటో నిరూపించుకోవడంతో పాటు చాలాకాలంగా బుల్లితెరపై కూడా అందరినీ ఆకట్టుకుంటున్నారు అమితాబ్. ఈ రోజు (అక్టోబర్ 11) ఆయన 77వ పుట్టిన రోజు.

యూపీలోని అలహాబాదులో కళాకారుల ఇంట్లో అక్టోబర్ 11 1942లో జన్మించారు. తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్. ఆయన ఓ హిందీ కవి. నెహ్రూ కుటుంబంతో వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. అమితాబ్‌కు బాల్యం నుంచే నాటకాలు అంటే ఆసక్తి. ఆ కారణం గానే సినిమాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు. అమితాబ్ తొలుత ఆలిండియా రేడియోలో అనౌన్సర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ గొంతు బాగా లేదని అక్కడ తిరస్కరణకు గురయ్యారు. అటు తర్వాత కోల్ కతాలో షిప్పింగ్ కంపెనీలో చేరారు. ఈ ఉద్యోగం సంతృతికరంగా లేకపోవడంతో రిజైన్ చేసి ఢిల్లీకి వచ్చారు. అప్పటికే నాటకాల అనుభవం ఉంది.

దీంతో తాను ఎలాగైనా నటుడిగా ఎదగాలని 1968లో ముంబై వచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టారు. చాలామంది అతనిని తిరస్కరించారు కూడా. అలా తిరస్కరించబడిన బిగ్ బీకి హఠాత్తుగా ఓ అవకాశం వచ్చింది. రూ.10 పారితోషికంతో యాడ్ ఫిల్మ్‌లో నటించమని అడిగారు. కానీ ఆ అవకాశాన్ని వదులుకున్నారు అమితాబ్. 1969లో సినిమాల్లో మొదటి సినిమా అవకాశం వచ్చినా, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అయితే ఆ సినిమాలోని ఏడుగురు హీరోల్లో ఒకరు అయిన అమితాబ్ మాత్రం హైలెట్ అయ్యారు. ఆయన గొంతే ఆయనను గుర్తించేలా చేసింది. పైగా ఇదే ఈ సినిమాకు గాను అతనికి జాతీయ అవార్డు వచ్చింది.

ఎనిమిది పదుల వయస్సుకు వస్తున్నప్పటికీ బిగ్ బీ ఇప్పటికీ హుషారుగా నటిస్తారు. అనేక పాత్రల్లో చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఓ సమయంలో యాభైకి పైగా యాడ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఇరవైకి పైగా కంపెనీలకు ప్రచురణ కర్తగా ఉన్నారు. ఇటీవలే టాలీవుడ్ తెరపై కూడా మెరిశారు.

more updates »