మహేష్‌ను గోడ కూర్చి వేయించిన బిగ్‌బాస్

మహేష్‌ను గోడ కూర్చి వేయించిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకలు హౌస్‌మేట్స్ ప్రాణాల మీదకు వచ్చింది. ఆయన పంపించే కేకులు తినలేకచచ్చారు. అలాగే.. బిగ్‌బాస్ నిద్రపోతున్నాడు.. డిస్టర్బ్ చేయకూడదని హెచ్చరించాడు. ఎలాంటి టాస్క్‌లు ఇచ్చినా.. శబ్దం రాకుండా చేయాలని తెలిపాడు. దీంతో హౌస్‌మేట్స్‌కు కొన్ని టాస్క్‌లను ఇచ్చాడు.

బెలూన్లకు షేవింగ్ చేయాలని రాహుల్, వితికాలకు, టాస్క్ పూర్తయ్యే తలపై ప్లేట్ పెట్టుకుని గోడ కూర్చి వేయాలని మహేష్‌కు, చేతులు, కాళ్లకు వ్యాక్స్ చేసుకోవాలని బాబాకు, శివజ్యోతి రాహుల్‌కు చక్కిలి గింతలు పెట్టాలని, శ్రీముఖిని ఎత్తుకుని గార్డెన్ ఏరియాలో 20 రౌండ్లు వేయాలిన అలీకి టాస్క్ ఇచ్చాడు.

అయితే వితికా బెలూన్లకు షేవింగ్ సరిగా చేయలేదని, మహేష్ ప్లేట్‌ను కిందపడేసి శబ్దం చేశాడని, శ్రీముఖి, వరుణ్, శివజ్యోతి నవ్వారని వీరంతా తన నిద్రకు భంగం కలిగించాడని తెలిపాడు. అనంతరం తన బొమ్మను గీయమని ఇంటి సభ్యులను ఆదేశించాడు. తాను ఎలా ఉంటానో ఊహించుకుని బొమ్మ గీయాలని తెలిపాడు. ఒక్కొక్కరు తాము గీసిన బొమ్మను వివరించసాగారు. అలీ గీసిన బొమ్మను చూసి అందరూ నవ్వారు.

అనంతరం బిగ్‌బాస్ పంపే కేకులను తినలేక హౌస్‌మేట్స్ అందరికీ విసుగెత్తింది. ఇక చాలు మహాప్రభో అని దండం పెట్టే లెవల్‌కు వచ్చారు. కేకులతోనే మమ్మల్ని చంపేస్తావా? అంటూ మహేష్ బిగ్‌బాస్ పై అరిచాడు. అనంతరం తాను పంపే ట్యూన్‌కు ఓ పాటను రాసి.. రాహుల్ పాడాలని, ఆ పాటకు అందరూ డ్యాన్స్ చేయాలని అదంతా ఒప్పో ఫోన్‌త్ రికార్డ్ చేయాలనే టాస్క్ ఇచ్చాడు.

ఇక హౌస్‌మేట్స్ నిద్రకు భంగం కలిగించేలా.. ఉదయం మూడు గంటలకే పెద్ద పెద్ద శబ్దాలను చేశాడు. అయినా ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. మళ్లీ ఉదయం ఐదు గంటల సమయంలో మళ్లీ పెద్ద శబ్దాలు చేశాడు. ఉదయాన్నే లేచాక వారు బాబాకు కొరియోగ్రఫీ చేయడం మొదలెట్టారు. ఈ వీడియోతో బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలు ముగిసినట్టు పేర్కొన్నాడు. దీంతో హౌస్‌మేట్స్ అంతా ఊపిరిపీల్చుకున్నారు.

more updates »