చిరంజీవి-చరణ్ మల్టీ స్టార్ మూవీ షురూ

చిరంజీవి-చరణ్ మల్టీ స్టార్ మూవీ షురూ

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో అభిమానులకు బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చారు మెగా స్టార్ చిరంజీవి. అంతకుమించిన కిక్ ఇస్తానంటున్నారు దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు దసరాను పర్వదినాన్ని పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి నటించనున్న 152వ సినిమా ఇది. చిరంజీవి భార్య సురేఖ క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమంలో చిరు తల్లి, కుమారుడు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. చిరంజీవితో కొరటాల చేయబోయే తొలి సినిమా ఇది. ‘సైరా’ సక్సె్స్‌ను చిరు ఇమేజ్‌ను మైండ్‌లో పెట్టుకుని కొరటాల జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాలి. సినిమాలో అభిమానులకు కావాల్సింది ఏ చిన్న పాయింట్ మిస్సయినా రఫ్ఫాడించేస్తారు. ‘సైరా’కు ముందు కొరటాల, చిరు సినిమా వచ్చుంటే అంచనాలు వేరేలా ఉండేవి.

కానీ ‘సైరా’ తర్వాత ఆయన చేసే ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. కొరటాల మంచి అనుభవమున్న దర్శకుడు కాబట్టి చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం లేదు. పైగా ఆయన తీసే సినిమాల్లో సోషల్ మెసేజెస్ ఎక్కువగా ఉంటాయి. చిరు సినిమాలన్నీ కూడా దాదాపు ఈ ఎలిమెంట్‌తో తెరకెక్కినవే.

కాబట్టి వీరిద్దరి నుంచి కూడా ఓ బ్లాక్ బస్టర్‌ను ఆశించవచ్చు. సినిమాలో ఇంకా కథానాయిక ఎవర్నది తెలియరాలేదు. అంతకుముందు అనుష్క, నయనతార పేర్లు వినిపించాయి. కానీ ‘సైరా’లో వీరిద్దరూ ఉన్నారు కాబట్టి మళ్లీ ఎందుకు రిపీట్ చేయడం ఎందుకుని కొరటాల భావించారట. అందుకే గోవా బ్యూటీ ఇలియానాను తీసుకునే అవకాశమున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎలాంటి టెన్షన్ లేకుండా ముందు చిరంజీవి కనిపించని సన్నివేశాలు తెరకెక్కించేయాలని కొరటాల భావిస్తున్నారట.

అయితే సైరా సినిమాలాగే ఈ సినిమాను కూడా హిందీ, తమిళం భాషల్లోనూ విడుదల చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే సినిమాను ఉగాది సందర్భంగా 2020 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

more updates »