మహేష్ బాబు, అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్..

మహేష్ బాబు, అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్..

మహేష్ బాబు, అల్లు అర్జున్ వార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో ఈ ఇద్దరూ జనవరి 12వ తేదీని విడుదల తేదీగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఇద్దరు స్టార్ హీరోల వార్ అనివార్యమైంది.

దీంతో ఈ సంక్రాంతికి బిగ్ క్లాష్ తప్పదని ఫిక్స్ అయ్యారంతా. కానీ పరిస్థితి గమనించిన దిల్ రాజు.. అల్లు అర్జున్, మహేష్ బాబులతో సీక్రెట్ మీట్ ఏర్పాటు చేసి.. వారిరువురి నడుమ రాజీ కుదిర్చినట్లుగా సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని, అలాగే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 11న విడుదల చేయాలని వాళ్ళ మధ్య ఓ ఒప్పందం కుదిర్చారని తెలుస్తోంది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాకు ఓ ప్రొడ్యూసర్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ‘అల వైకుంఠపురములో' సినిమా నైజాం రైట్స్ దిల్ రాజే తీసుకున్నాడు. సో.. కమర్షియల్‌గా ఈ రెండు సినిమాల క్లాష్ అంతమంచిది కాదని ఆయన భావించి ఇలా ఎంటర్ కావాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది.

దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు మహేష్, అల్లు అర్జున్ ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చి రెండు రోజుల గ్యాప్‌తో వారి వారి సినిమాలు రిలీజ్ చేసేందుకు అంగీకారం తెలిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా మహేష్ ‘భరత్ అను నేను', అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య' సినిమాల విషయంలోను ఇలాగే క్లాష్ ఎదుర్కొని చివరకు వారం తేడాలో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. చూడాలి మరి ఈ వార్తలపై ఈ రెండు సినిమాల పీఆర్ టీమ్స్ ఎలా స్పందిస్తాయనేది.

more updates »