'ఐస్' తో బిగ్ బి కు బర్త్ డే శుభాకాంక్షలు

'ఐస్' తో బిగ్ బి కు బర్త్ డే శుభాకాంక్షలు

మొదట నీ వాయిస్ గాంభీర్యంగా ఉంది....నీ హైట్ చాల ఎక్కువ...వీటివల్ల నువ్వు సినిమాల్లో హీరో అవ్వలేవు...అని చెప్పి వెనక్కి పంపగా...అలాంటి కష్టాలన్నీ దాటుకొని నేడు ఇండియన్ సినిమాలను శాసించే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరో కాదు....బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. బాషా ఏదైనా తనదైన నటనతో మెప్పించగల సామర్థ్యం ఉన్న హీరో బిగ్ బి నేడు 77వ వసంతోలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ముంబైలోని బిగ్ బీ నివాసానికి చేరుకుంటున్నారు. ఓ అభిమాని అమితాబ్ వేషధారణలో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. కొల్హాపూర్ కు చెందిన ఓ కళాకారుడు మంచుతో 77 వసంతాలను రూపొందించి బిగ్ బీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అమితాబ్ బచ్చన్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని తెలిసిన సంగతి. కోల్‌కతాలో అమితాబ్ అభిమానులు ఆయనకు ఓ గుడిని కట్టారు. అందులో ఇప్పటికీ ఆయన విగ్రహానికి పూజలు జరుగుతుంటాయి. ఇందరి హృదయాలలో పూజిమ్మబడుతున్న అమితాబ్ 1942 అక్టోబర్ 11 వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుంచే సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అది పెద్దయ్యే కొలది ఆ కోరిక మరింత బలంగా మారింది. ఆ కోరిక 1969 వరకు సాధ్యం కాలేదు. సినిమాల్లోకి వచ్చే ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొన్నారు. 1969లో భువన్ షోమ్ అనే సినిమాలో నటించారు. చిన్న నటుడిగా మాత్రమే అయన ఈ సినిమాలో కనిపించాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. దీని తరువాత, 1970 హిందుస్తానీ అనే సినిమాలో హీరోగా చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆనంద్ సినిమాలో సహనటుడిగా నటించి మెప్పించాడు. ఆ తరువాత వచ్చిన పర్వానా, రేష్మ ఔర్ షేరా సినిమాల్లో విలన్ గా చేశారు. ఈ రెండు చిత్రాలు అమితాబ్ కు మంచి పేరు తెచ్చిపెట్టినాయి. ఇక 1973లో వచ్చిన జింజర్ సినిమాతో అమితాబ్ లైఫ్ మారిపోయింది ఆ మూవీ సూపర్ హిట్ వరసగా అవకాశాలు వచ్చాయి. తరువాత 1975లో వచ్చిన షోలే సినిమా అయన కెరీర్లో ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి నుంచి అమితాబ్ వెనుదిరిగి చూసుకోలేదు. జింజర్, డాన్, త్రిశూల్, కూలి, అగ్నిపథ్, ఖుదాగవా, అగ్నివర్ష్, హమ్, బ్లాక్, పా, పీకు, వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. బిగ్ బి ఇప్పటి వరకు 180 కి పైగా సినిమాల్లో నటించారు. ఇటీవలే దక్షిణాదిన మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో అమితాబ్ చిరంజీవి గురువుగా నటించి మెప్పించారు. ఇలా సినిమాలు చేస్తులే బుల్లితెర సంచలనం కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం కు హోస్ట్ గా ఉంటూ మెప్పిస్తున్నారు. నేడు బిగ్ బి అమితాబ్ పుట్టినరోజు. ఈ 77 సంవత్సరాల సూపర్ స్టార్ మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుందాం.

more updates »