వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన హన్సిక

వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన హన్సిక

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత అటు తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది హన్సిక. అయితే కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్న నేపథ్యంలో అందరి హీరోయిన్లు లాగానే ఈ అమ్మడి జోరు కూడా తగ్గిందనుకోండి. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ కు జోడిగా తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

ఇక ఇదిలా ఉండగా హన్సిక ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టనున్నట్టు తెలుస్తుంది. పిల్ల జమిందార్, భాగమతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో హన్సిక ప్రధాన పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో హన్సిక అటు గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోనుందట. ముంబైలో ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.

మొత్తానికి ఇప్పుడు హీరో హీరోయిన్స్ కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే వెబ్ సిరీస్ లు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.

more updates »