దర్శక ధీరుడు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు

దర్శక ధీరుడు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని అత్యున్నత శిఖరాలకు చేర్చిన దర్శక దిగ్గజం రాజమౌళి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'స్టూడెంట్ నెంబర్ 1' చిత్రంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజమౌళి... ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు.

అతను ఏం చెయ్యగలడు అని మాటల్లో చెప్పడం రాదు అందుకే అతను చెయ్యాలనుకున్నది, కలగన్నది ఎంత కష్టమయినా, అసాధ్యం అయినా కూడా సాధించి తీరతాడు. అందుకే అతన్ని పొగడడానికి దర్శక ధీరుడు, దర్శక బాహుబలి, ఆల్ టైమ్ గ్రేట్ డైరెక్టర్ లాంటి పదాలు కూడా సరితూగగలవా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తనని తానే దాటి గెలవాలి అనే కసి, కొత్తగా ఎదో నేర్చుకోవాలి అనే ఆరాటం, ఆ నేర్చుకున్న దానితో అద్భుతాలు సృష్టించాలి అనే పోరాటం. అందుకే రాజమౌళి మెదడులో మగధీర, ఈగ, బాహుబలి లాంటి కళాఖండాలు పురుడుపోసుకున్నాయి. తెలుగు సినిమా తలెత్తుకుని నిలబడేలా, ప్రపంచం అంతా టాలీవుడ్‌ని గుర్తించేలా, మనం అంతా గర్వపడేలా చేశాయి. ఒకప్పుడు సింహాద్రి, ఛత్రపతి లాంటి సినిమాలు రాజమౌళి తీసాడు అంటే ఇప్పుడు నమ్మడం కష్టమే.

రాజమౌళి తీసిన బాహుబలి...ఈ ఒక్క సినిమాతో ఇండియన్ సినిమా బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అనే పరిస్థితి వచ్చింది. బాహుబలి సిరీస్‌లోని రెండు సినిమాలతో ప్రేక్షకుల మనస్సులలో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు జక్కన్న.

ఇక ఇప్పుడు రాజమౌళి తీస్తున్న RRR సినిమా గురించి ఎన్ని దేశాలు వెయిటింగ్‌లో ఉన్నాయో తెలుసా. అది పాన్ ఇండియా సినిమా అనేకంటే కూడా వరల్డ్ సినిమా, యూనివర్సల్ సినిమా అంటే బెస్ట్. ఇప్పటికే ఇండియన్ సినిమా శిఖరాగ్రాన్ని అధిరోహించిన రాజమౌళి అలియాస్ జక్కన్న ఈ సారి RRR తో బాహుబలికి పదింతలు సక్సెస్ అందుకోవాలని, ముందు ముందు కూడా కలకాలం నిలిచిపోయే కళాఖండలు తియ్యాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు SS రాజమౌళి.

more updates »