బాలయ్య చిత్రాన్ని కి ఇంట్రెస్టింగ్ టైటిల్స్

బాలయ్య చిత్రాన్ని కి ఇంట్రెస్టింగ్ టైటిల్స్

‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గానూ, గ్యాంగ్ స్టర్ గానూ… రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో బాలయ్య దర్శనమివ్వనుండగా, అత‌నికి జోడీగా సోనాల్ చౌహాన్‌, వేదిక న‌టిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న‌ ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి నాలుగు ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నట్టు స‌మాచారం. క‌థ‌, హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌కు త‌గ్గ‌ట్టుగా ‘రూలర్’, ‘క్రాంతి’, ‘జడ్జిమెంట్’, `డిపార్ట్‌మెంట్‌` అనే నాలుగు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. త్వ‌ర‌లోనే ఈ నాలుగింటిలో ఒక టైటిల్‌ను ఫైన‌లైజ్‌ చేసే అవకాశం ఉంద‌ని టాక్‌. మ‌రికొద్దిరోజుల్లో బాలయ్య కొత్త చిత్రం టైటిల్‌పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది. కాగా… ఈ సినిమాకి సంబంధించిన‌ నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్ 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనుంది.

చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం సాగుతోంది.

more updates »