నిర్మాత కేఎల్‌ నారాయణ ఇంట్లో ఐటీ సోదాలు

నిర్మాత కేఎల్‌ నారాయణ ఇంట్లో ఐటీ సోదాలు

ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్‌ అధినేత కేఎల్‌ నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు జరుపుతామని అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ కార్యాలయాలు, నివాసాల్లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం.

దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ పలు హిట్‌ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. హలో బ్రదర్‌, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ, దొంగాట, క్షణక్షణం వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన చాలా కాలంగా సినిమాలు చెయ్యడం లేదు. 2006లో విడుదలైన రాఖీ ఆయన చివరి సినిమా. అయితే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చెయ్యడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం వారిద్దరికీ అడ్వాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తరువాత ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

more updates »