కలకలం రేపుతున్న బన్నీ ఫ్లెక్సీ

కలకలం రేపుతున్న బన్నీ ఫ్లెక్సీ

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పైన తరచుగా ఎదో ఒక కాంట్రవర్సీలు రావడం చూస్తూనే ఉంటాం... అయితే తాజాగా అందుకు బిన్నంగా ఓ టాలీవుడ్ సెలెబ్రిటీపై ఫ్లెక్సీ కట్టి మరి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఆ హీరో ఎవరో కాదు.... టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వివరాల్లోకి వెళితే ... సినిమా వారికి కేరాఫ్ అడ్రెస్ అయిన కృష్ణానగర్ ఏరియాలో అల్లు అర్జున్ పై కామెంట్ చేస్తూ పెట్టిన ఫ్లెక్సీ ఇప్పుడు కలకలం రేపుతోంది. తెలుగు సినీ ప్రేక్షకులు ఇతన్ని హీరోగా భావిస్తున్నారు. కానీ ఇతను మాత్రం(మాతృ) తెలుగు సినీ కార్మికుల పొట్ట కొడుతున్నాడు ఎందుకు???” తెలుగు సినీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని ఒక ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.అల్లు అర్జున్ వి రెండు ఫోటోలు పెట్టి ఇదంతా రాసి ఉంది. అయితే ఈ ఫ్లెక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్లెక్స్ గిట్టనివారు ఎవరైనా చేసారా ? లేక వేరే హీరో అభిమానులు చేశారా అనే విషయం తెలియాల్సి వుంది. అసలు ఇదంతా ఎవరు చేసారో ఎందుకు చేసారో అన్నది ఎప్పుడు తెలుస్తుందో చూడాలి.

more updates »