కల్యాణ్‌ రామ్‌ 'ఎంత మంచివాడవురా’ టీజర్

కల్యాణ్‌ రామ్‌ 'ఎంత మంచివాడవురా’ టీజర్

‘రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసురుడిని వేసెయ్యలా’ అని అంటున్నారు నందమూరి కల్యాణ్‌ రామ్‌. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. కాగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌కు జంటగా మెహరీన్‌ నటిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

more updates »