కియరా అద్వాణీ ట్విట్టర్ హ్యాక్..

కియరా అద్వాణీ ట్విట్టర్ హ్యాక్..

అమితాబ్ బచ్చన్- పవన్ కల్యాణ్- కత్రిన కైఫ్- అద్నాన్ సమీ- షాహిద్ కపూర్ .. ఒకరేమిటి ఎందరో ప్రముఖుల ట్విట్టర్లు హ్యాక్ కి గురైన సంగతి తెలిసిందే. హ్యాకింగ్ కి గురైతే దుష్పరిణామాలు ఎలా ఉంటాయో అభిమానులకు ప్రత్యక్షంగానే తెలిసొచ్చింది చాలా సందర్భాల్లో. అందుకే తన ట్విట్టర్ హ్యాక్ కి గురైందని తెలుసుకున్న కియరా అద్వాణీ ఒకటే టెన్షన్ కి గురవుతోంది.

ఈ టెన్షన్ లోనే అభిమానుల్ని వెంటనే అలెర్ట్ చేసింది. ``నా ట్విట్టర్ నా కంట్రోల్ లో లేదు. ఎవరో హ్యాక్ చేశారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ వర్క్ జరుగుతోంది. అసలు నా ట్విట్టర్ ని పొరపాటున కూడా ఫాలో కావొద్దు. అందులో వచ్చే ట్వీట్లను పట్టించుకోవద్దు. సరి కాగానే నేనే చెబుతాను`` అని వెల్లడించింది. ఆ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఏ లింకుల్ని దయచేసి చూడొద్దు అని కూడా రెక్వస్ట్ చేసింది. అనుమానా స్పదంగా ఉన్న ఆ లింకులు టచ్ చేయొద్దని కోరింది. ఆ లింకులేవీ నేను పంపలేదని తెలిపింది.

ప్రస్తుతం కియారా కెరీర్ ని పరిశీలిస్తే.. తన ఖాతాలో భారీ చిత్రాలు ఉన్నాయి. భూల్ భులయ్యా 2- లక్ష్మీ బాంబ్- ఇందూ కి జవానీ చిత్రాల్లో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన షేర్ షా అనే చిత్రంలోనూ కథానాయికగా ఆడిపాడుతోంది. 2020లో ఈ సినిమాలన్నీ రిలీజ్ కానున్నాయి. అలాగే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గిల్టీలోనూ అదిరిపోయే రోల్ లో నటిస్తోందట

more updates »