ఆ భాద్యతను మహేష్ బాబుకి అప్పగించిన రజినీకాంత్

ఆ భాద్యతను మహేష్ బాబుకి అప్పగించిన రజినీకాంత్

రజినీకాంత్ కొత్త సినిమా దర్బార్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అయితే, నవంబర్ 7 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దర్బార్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. దర్బార్ మోషన్ పోస్టర్ ను మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నారని ప్రకటించిన మురుగదాస్ తెలుగు, తమిళ మోషన్ పోస్టర్లను రిలీజ్ చేసే బాధ్యతను మాత్రం కమల్ హాసన్ కు అప్పగించాడు.

అందరూ ఆయా ఇండస్ట్రీలకి చెందిన సూపర్ స్టార్స రిలీజ్ చేస్తుండడం కాస్త ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు తెలుగు విషయానికి వస్తే కమల్ కాకుండా మహేష్ బాబు రిలీజ్ చేయనున్నారని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. రజినీకాంత్.. మురుగదాస్ కాంబినేషన్ అనగానే ఒక క్రేజ్ వచ్చింది. పైగా ఇందులో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. 25 సంవత్సరాల క్రితం రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. మరలా ఇప్పుడు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.

more updates »