చిన్నపిల్లలా కనిపించాలని స్థనాలకు టేపు వేశారు

చిన్నపిల్లలా కనిపించాలని స్థనాలకు టేపు వేశారు
మనం స్క్రీన్ పై నటీనటులు అందించే ఎంటర్ టైన్ మెంట్ ను ఎంజాయ్ చేస్తాం. కాని ఆ ఎంటర్ టైన్ మెంట్ ను అందించేందుకు వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. కొందరు ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకు మగ ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడతారు. తాజాగా హాలీవుడ్ నటి మైసీ విలియమ్స్ ఇటీవల తాను నటించిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వివరించింది. ఆమె మాట్లాడుతూ.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కొత్త సిరీస్ లో నేను చిన్న అమ్మాయిగా కనిపించాల్సి ఉంది. కథానుసారంగా నేను చిన్నగా కనిపించేందుకు మేకప్ విషయంలో చాలా కష్టపడ్డాను. అదే సమయంలోనే 22 ఏళ్ల వయసు ఉన్న కారణంగా నా స్థనాలు పెద్దగా ఉన్నాయి. చిన్న పిల్లలా కనిపించేందుకు నా స్థనాలను టేపుతో చాలా టైట్ గా బంధించేశారు. ఆ సమయంలో చాలా ఇబ్బంది కలిగింది. షూటింగ్ జరిగినన్ని రోజులు మానసికంగా బాధపడ్డ సందర్బాలు చాలా ఉన్నాయి. షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా నన్ను నేను అద్దంలో చూసుకునేందుకు కాస్త సిగ్గుగా భయంగా అనిపించింది. నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో నటిస్తున్నాను. నా శరీరంలో వచ్చిన మార్పులు కనిపించకుండా చేసేందుకు మేకర్స్ చాలా ప్రయత్నాలు చేశారు. వాటివల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె చెప్పింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇలాంటి సమయంలో ఈమె పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంత ఇబ్బందిగా ఉంటే ఎందుకు నటించాల్సి వచ్చింది.. డబ్బు కోసం నటించి పబ్లిసిటీ కోసం ఇలా కామెంట్స్ చేస్తున్నావు అంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.
more updates »