అక్కను మించిన చెల్లి...!

అక్కను మించిన చెల్లి...!

సినీ ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరికీ కలిసొస్తుందో చెప్పడం కొంచెం కష్టమే...అందం,అభినయం అన్ని ఉన్న కూడా కొందరు భామలు ఎందుకో చిత్ర సీమలో నెగ్గుకురాలేరు. చిత్రరంగంలో గ్లామర్ తో అదృష్టం కూడా కలిసిరావాలి....సినిమా ఇండస్ట్రీలో తమ గ్లామర్ తో అడుగుపెట్టిన హీరోయిన్లలో నేహా శర్మ, అదాశర్మలు మూవీలో తమ అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయరు. కమర్షియల్ హీరోయిన్లుగా ఎదిగేందుకు కావాల్సిన అందం ఉంది. స్కిన్ షో చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారు. కానీ, ఇండస్ట్రీలో అవకాశాలు పెద్దగా రాలేదు. ఈ ఇద్దరు హీరోయిన్లను పూరి జగన్నాధ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఫస్ట్ సినిమాతో ఇద్దరు ఆకట్టుకున్నారు.చిరుత సూపర్ హిట్‌ కావడంతో ఇండస్ట్రీలో రామ్ చరణ్ టాప్‌గా నిలిచాడు.. కానీ ఆ సినిమాలోని హీరోయిన్ నేహా శర్మకు మాత్రం అవకాశాలు దొరక్క ఇబ్బందులు పడుతోంది. హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయమైన అదాశర్మ కూడా అవకాశాలకోసం ఇబ్బందులు పడుతోంది. ఈ ఇద్దరు భామలు సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ళకి మతి పోగొడుతుంటారు. ఇప్పుడు ఇదే బాటలో నేహా శర్మ చెల్లి ఐషా శర్మ కూడా నడుస్తోంది. ఐషా ఇటీవలే ఫోటోషూట్ చేసింది. హీరోయిన్ గా అవకాశం వస్తే స్కిన్ షో కు సిద్ధం అని చెప్పేందుకు ఫోటోషూట్ చేసినట్టుగా ఉన్నది. ఐషా ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాదు, నేహా శర్మ, అదాశర్మలకు మించేలా ఉందని కొందరు చెప్తుంటే.. గ్లామర్ కు బాద్షా అని కొందరు అంటున్నారు.

more updates »