మహేష్ మేనల్లుడితో 'ఇస్మార్ట్ బ్యూటీ'

మహేష్ మేనల్లుడితో 'ఇస్మార్ట్ బ్యూటీ'

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి మరో హీరో టాలీవుడ్ లోకి తెరంగ్రేటం చేయబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతక మణి’, ‘దేవదాస్’ చిత్రాలతో ప్రశంసలు దక్కించుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ తొలి సినిమా చేయనున్నాడు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబ‌ర్ 10న పలువురు సినీ ప్ర‌ముఖు ల స‌మ‌క్షంలో గ్రాండ్ లాంచ్‌కానుంది. రీసెంట్‌గా `ఇస్మార్ట్ శంక‌ర్‌` వంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన నిధి అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వీకే నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

more updates »