‘ప్రతి రోజూ పండగే’ మూవీ అప్ డేట్స్

‘ప్రతి రోజూ పండగే’ మూవీ అప్ డేట్స్

మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. తేజ్ కి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. కుటుంబ బంధాల నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో స‌త్య‌రాజ్, రావుర‌మేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘మనిషి పుట్టుకే కాదు, చావు కూడా ఒక పండగలాంటిదే’ అన్న ఆలోచనలో నుంచి పుట్టిన కథే ఈ సినిమా అని… ‘చావుబతుకుల్లో ఉండే మనిషిని మానసికంగా సంతోషపెడితే అత‌ను మరికొద్ది రోజులు బ‌తికే అవ‌కాశం ఉంటుంద‌ని… ఇదే విష‌యాన్ని కొంచెం వినోదాత్మకంగా చెప్పనున్నామ’ని ద‌ర్శ‌కుడు మారుతి పేర్కొన్నాడు. అలాగే, ప్రకృతి నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పచ్చని పొలాల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించామని… ఇప్పటివరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని మారుతి తెలిపాడు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ను… డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.

more updates »