మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజ్ త‌రుణ్‌

మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజ్ త‌రుణ్‌

యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ కథానాయకుల్లో రాజ్ తరుణ్ ఒకరు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ హ్యాట్రిక్ హీరో… ప్రస్తుతం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న రాజ్… ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ కాగా… మరొకటి ‘గుండెజారి గ‌ల్లంత‌య్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండ‌గానే… ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ యంగ్ హీరో.

ఆ వివరాల్లోకి వెళితే… మూడేళ్ళ క్రితం తనతో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన శ్రీనివాస్ గవిరెడ్డితో మరోసారి జట్టుకట్టనున్నాడట రాజ్ తరుణ్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. మరి.. రాజ్ తరుణ్, శ్రీనివాస్ కాంబినేషన్‌కి… రెండో చిత్రంతోనైనా విజయం వరిస్తుందేమో చూడాలి.

more updates »