సామ్ న్యూ స్ట‌న్నింగ్ లుక్

సామ్ న్యూ స్ట‌న్నింగ్ లుక్

సినీ రంగంలో హీరోలకి ఎక్కువ ఆధిక్యత ఉంటుందని తెలిసిందే...హీరోస్ తో కంపేర్ చేస్తే చిత్రసీమలో హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ కొంచెం తక్కువే. అయితే ఈ హీరో స్టార్ డమ్ తట్టకుంటూ సినీ ఇండస్ట్రీలో తమదైన నటనతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోవడం అనేది చెప్పుకోతగ్గ విషయం....అలాంటి హీరోయిన్స్ లో నయనతార, సమంత ముందున్నారని తెలిసిన సంగతి. సామ్ అక్కినేని కోడలిగా మాత్రమే కాకుండా, సినిమాల్లో తన నటనతోప్రేక్షకులని మంత్రముగ్ధులను చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా సమంత అక్కినేని చాలా రోజుల తరువాత దర్శనమిచ్చింది. గ్లామరస్ హీరోయిన్ గానే కాకుండా విభిన్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ చివరగా ఓ బేబీ – మజిలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

అయితే ఓ బేబీ చిత్రం తర్వాత ఆడియెన్స్ కి కొంత గ్యాప్ ఇచ్చిన సామ్ ఫైనల్గా ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా సమంతా చేసిన ఫోటో షూట్ అందరినీ కట్టిపడేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో డ్రెస్సింగ్ స్టయిల్ అదరగొడుతోంది. టాప్ అండ్ స్కర్ట్ లో వయ్యారంగా నిలబడి సామ్ ఇచ్చిన స్టిల్ నిమిషాల్లో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం సమంత ఎలాంటి క్యారెక్టర్ తో వస్తుందా అని ఓ వర్గం ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తోంది. తమిళ్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ క్యూట్ లవ్ స్టోరీలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు.

more updates »