తిప్పరామీసం మూవీ రివ్యూ

తిప్పరామీసం మూవీ రివ్యూ

  • నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి, బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్యర్ త‌దిత‌రులు
  • మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
  • సినిమాటోగ్రఫీ: సిధ్
  • నిర్మాత: రిజ్వాన్
  • దర్శకత్వం : ఎల్ కృష్ణ విజయ్
  • వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో శ్రీవిష్ణు నెగటివ్‌ షెడ్స్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ క్రమంలో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించాడా? మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? తెలుసుకుందాం పదండి..

    కథ : మణిశంకర్ చిన్న తనంలోనే డ్రగ్స్‌కి ఎడిక్ట్ అయి.. చివరికి తల్లిపైనే ద్వేషం పెంచుకుంటాడు. ఆమెను శత్రువులా చూస్తుంటాడు. ఇలాంటి మణిశంకర్ పెరిగి పెద్దయ్యాక ఒక పబ్‌లో డీజే గా పని చేస్తూ.. విపరీతంగా బెట్టింగ్స్ చేస్తూ కొన్ని ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ మధ్యలో మౌనికతో ప్రేమలో పడతాడు.

    మరో పక్క తనకు వచ్చిన సమస్యల నుంచి బయట పడటానికి డబ్బు కోసం ఇల్లీగల్ గేమ్స్ ఆడుతుంటాడు. వాటి కారణంగా అతని జీవితం ఉహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మణిశంకర్ జీవితంలో చోటు చేసుకున్న ఆ మలుపు ఏమిటి? చివరికి తన తల్లి ప్రేమను అతను అర్ధం చేసుకుంటాడా? లేదా? అసలు అతను తల్లిని అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

    విశ్లేషణ: మారిపోయాడనే కథ బాగానే ఉన్నా.. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా ఫస్టాఫ్‌ అంతా ఫ్లాట్‌గా సాగుతూ.. పెద్దగా ఆసక్తి రేకెత్తించదు. మణి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్‌ చేయడానికి డైరెక్టర్‌ దాదాపు ఫస్టాఫ్‌ అంతా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమా మీద ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగకపోగా.. మోనిక (నిక్కీ తంబోలీ)తో మణి లవ్‌, తనకు అప్పు ఇచ్చిన బూకీ జోసెఫ్‌తో మణి గొడవ, మణిని అతను ఏడురోజులపాటు బంధించడం ఈ సీన్లన్నీ బిట్లుబిట్లుగా వచ్చిపోయినట్టు అనిపిస్తాయి. డ్రగ్స్‌, మద్యం, స్మోకింగ్‌ అలవాటు వంటి సీన్లు చూపించినా మణి పాత్రలో పెద్దగా నెగిటివ్‌ షెడ్స్‌ ఉన్నట్టు అనిపించదు. అతని కోణంలో ప్రేక్షకుడికి అతనిపై జాలి కలుగుతుంది. పైగా చాలాచోట్ల మణి పాత్ర కూడా డైరెక్టర్‌ డల్‌గా డీల్‌ చేసినట్టు అనిపిస్తుంది.

    మదర్‌ సెంటిమెంట్‌తో​ తీసిన సినిమాలు చాలావరకు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో తల్లీని కోర్టుకీడ్చడం.. కొడుకు కోసం తల్లి ఇల్లు అమ్మి డబ్బులు వంటి సీన్లు కొంతమేరకు బాగుండి ప్రేక్షకుల కనెక్ట్‌ అయ్యే అవకాశముంది. సెకండాఫ్‌లోనూ వచ్చే సీన్లు పెద్దగా ఆసక్తికరంగా అనిపించవు. శ్రీవిష్ణుకు మాస్‌ ఇమేజ్‌ కోసం ఈ సినిమాల్లో అక్కడక్కడ పెద్ద ఫైట్లే పెట్టారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్వీస్ట్‌.. మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు అనే అంశాలు ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో మదర్‌ సెంటిమెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, అప్పటికే సినిమాతో ప్రేక్షకుడు కొంతవరకు డిస్‌ కనెక్ట్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. మరోసారి శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. కథనం ఫ్లాట్‌గా ఉన్నా చాలా సీన్లలో, ముఖ్యంగా మదర్‌ సెంటిమెంట్‌ సీన్లలో శ్రీవిష్ణు అదరగొట్టాడు. హీరోయిన్‌ నిక్కీ తంబోలీ పాత్ర కొద్దిసేపు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కథలో భాగంగా నిక్కీ ఎస్సై పాత్రను పోషించిప్పటికీ పెద్దగా ఆకట్టుకునే సీన్లు లేవు. సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ, ఇతన నటులు తమ పరిధి మేరకు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సురేశ్‌ బొబ్బలి అందించిన పాటలు అంతగా గుర్తుండకపోయినా.. నేపథ్య సంగీతం బావుంది. సినిమా నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమా టైటిల్‌ ‘తిప్పరా మీసం​’ అంటూ పౌరుషం రేకెత్తించేలా ఉన్నా.. సినిమా మాత్రం మీసం తిప్పేలా లేదు.

    బలాలు :

  • శ్రీ విష్ణు
  • క్లైమాక్స్
  • బలహీనతలు :

  • కథ,
  • కథనం
  • ఎమోషన్స్
  • సాగతీత
  • more updates »