వరుణ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు

వరుణ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్స‌ర్‌గా దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు… ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు ఈ మ్యాచో స్టార్‌. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్… ఈ నెల 10న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2020 ఆరంభంలో మొదలవుతుందని టాక్.

కాగా…ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా… అల్లు బాబి, సిద్ధూ ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం ఎస్.ఎస్.థ‌మ‌న్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ ఛాయాగ్రహణం అందించనున్నాడు.

more updates »