‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ రిలీజ్

‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ రిలీజ్

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీ మామ’. ఈ చిత్రంలో రియల్ లైఫ్ మామ అల్లుడు రీల్ లైఫ్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ మరియు ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించాయి.

తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ గా ‘వెంకీ మామ’ అంటూ సాగె టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. తన మామయ్య గురించి మేనల్లుడు ఎంతో గొప్పగా చెప్తూ మాస్ స్టైల్ బీట్ తో సాగిన ఈ సాంగ్ కి థమన్ అందించిన మ్యూజిక్ పెద్ద అసెట్. ఈ సాంగ్ ను సింగర్ శ్రీకృష్ణ ఆలపించగా, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఈ లిరికల్ వీడియోని బట్టిచూస్తే పల్లెటూరి వాతావరణంలో మామ, అల్లుళ్లయిన వెంకటేష్, చైత్యన్యల మధ్య ఈ సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలో ఖరారు చేయనున్నారు.

more updates »