విజయ్ దేవరకొండ సరసన 'వింక్' బ్యూటీ?

విజయ్ దేవరకొండ సరసన 'వింక్' బ్యూటీ?

ప్రియా ప్రకాష్ వారియర్… ఒక్క‌ కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ వింక్ బ్యూటీ… ప్ర‌స్తుతం యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో రానున్న సినిమాతో తెలుగునాట కథానాయిక(సెకండ్ హీరోయిన్)గా తొలి అడుగులు వేస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే… ఇప్పుడు మరో తెలుగు చిత్రంలో నాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే… యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ అనే మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో… విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్నాడు. 2020 జనవరి నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో… విజయ్‌కు జోడీగా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ను సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌… 2020 వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు స‌మాచారం. కాగా… త్వరలోనే ప్రియా ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రియ తెలుగుతో పాటు హిందీ(‘శ్రీదేవి బంగ్లా’), కన్నడ(‘విష్ణుప్రియ’) భాషల్లోనూ నాయికగా నటిస్తోంది.

more updates »