అలియా భట్ నెంబర్ కోసం కరణ్ కు మెసేజ్ చేశా

అలియా భట్ నెంబర్ కోసం కరణ్ కు మెసేజ్ చేశా

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే వెంటనే విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. వరుస హిట్లతో దూసుకుపోతూ విజయ్ ఉంటే సినిమా హిట్టే అన్న రేంజ్ కు ఎదిగాడు. అంతే కాదు ఈ హీరో కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం క్యూలో ఉన్నారంటే విజయ్ రేంజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలోనే యూత్ ఐకాన్ గా ఎదిగాడు. అంతేనా విజయ్ ను ఇష్టపడే యంగ్ హీరోయిన్స్ లిస్ట్ కూడా పెరిగిపోయిందనుకోండి. ఇక ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా విజయ్ ఓ బాలీవుడ్ హీరోయిన్ నెంబర్ కోసం కరణ్ కు ఫోన్ చేశాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో బాలీవడ్ క్యూటీ అలియా భట్. ఆ డైరెక్టర్ కరణ్. అసలు సంగతేంటంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ను.. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సినిమా ఏది అని అడుగగా దానికి విజయ్ బాలీవుడ్ లో వచ్చిన ‘గల్లీ బాయ్’ అని ఆ సినిమా చూసిన తర్వాత నాకు రాత్రి మొత్తం నిద్ర పట్టలేదు.. అలియా నటన నాకు చాలా బాగా నచ్చింది.. తనను అభినందించాలనుకున్న.. తన నెంబర్ కోసం కరణ్ కు మెసేజ్ చేశా అని కూడా చెప్పుకొచ్చాడు. మరి నిజంగానే ఆ సినిమాలో అలియా నటన మెచ్చుకోవాల్సిందే.

more updates »