విశాల్ 'యాక్షన్' ప్రీ రిలీజ్ ఈవెంట్

విశాల్ 'యాక్షన్' ప్రీ రిలీజ్ ఈవెంట్

కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ లో మాస్ కథానాయకుడిగా పేరు ఉన్న హీరో విశాల్. ఈ హీరో సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ చేసి విడుదలవుతుంటాయి. తాజాగా సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన చిత్రం 'యాక్షన్'. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించి, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి యూనిట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు 'దసపల్లా కన్వెన్షన్'లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నేడు ఒక పోస్టర్ ను వదిలారు. విశాల్ సరసన నాయికగా తమన్నా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాంకీ .. ఐశ్వర్య లక్ష్మి .. ఛాయా సింగ్ .. కబీర్ దుల్హన్ సింగ్ .. యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ కల్నల్ సుభాష్ అనే ఆఫీసర్ పాత్రలో, తమన్నా కాప్ పాత్రలో నటించారు. హిప్ హప్ తమిళ సంగీతం అందించారు. టెర్రరిజం పై ఒక అధికారి చేసే పోరాటం కాన్సెప్ట్ తో ఫుల్ యాక్షన్ సీన్స్ తో రూపొందిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

more updates »