వివి వినాయక్ హీరో గా సీనయ్య మూవీ ప్రారంభం

వివి వినాయక్ హీరో గా సీనయ్య మూవీ ప్రారంభం

సూపర్ హిట్ మూవీ ఆది తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన VV వినాయక్ దర్శకత్వంలో రూపొందిన దిల్ ,ఠాగూర్, లక్ష్మీ , నాయక్, ఖైదీ నెం 150 మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు దర్శకుడు VV వినాయక్ హీరోగా మారారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహా దర్శకత్వంలో వినాయక్ హీరో గా సీనయ్య మూవీ వినాయక్ బర్త్ డే సందర్భంగా ఈ రోజుప్రారంభమయింది. 8 వ తేదీ విజయదశమి రోజున టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

సీనయ్య మూవీ ప్రారంభోత్సవానికి దర్శకులు కె. రాఘవేంద్ర రావు, కొరటాల శివ, సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ తదితరులు హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు క్లాప్ తో ప్రారంభమైన సీనయ్య మూవీ కి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ దిల్ మూవీ తో తనను నిర్మాత గా టాలీవుడ్ కు పరిచయం చేసిన వినాయక్ ను దిల్ రాజు హీరోగా పరిచయం చేయడం విశేషం.

more updates »