ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'బుర్రకథ' టీజర్

ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'బుర్రకథ' టీజర్

ఆది సాయికుమార్ కథానాయకుడిగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 'బుర్రకథ' రూపొందుతోంది. మిస్తీ చక్రవర్తి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ రెండు బ్రెయిన్లు వున్న యువకుడిగా కనిపించనున్నాడని ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

ఒక బ్రెయిన్ ఒకలా .. మరో బ్రెయిన్ ఒకలా పనిచేస్తూ ఉంటాయి. దాంతో ఆయన అలవాట్లలోను .. అభిరుచుల్లోను వెంటవెంటనే వేరియేషన్స్ కనిపిస్తూ వుంటాయి. ఈ సమస్య కారణంగా హీరో ఎలాంటి ప్రమాదంలో పడతాడు? ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? అనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది. ఈ మధ్యలోనే కావాల్సినంత కామెడీని పండించారనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమా అయినా ఆది సాయికుమార్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

more updates »