నిహారికకు పెళ్లి చేస్తా...మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నా: నాగబాబు

నిహారికకు పెళ్లి చేస్తా...మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నా: నాగబాబు

మెగా డాటర్ నిహారికకు అబ్బాయిని వెతికే పనిలో పడ్డారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చిన ఆయన.. మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నాం.. త్వరలోనే నిహారికకు పెళ్లి చేస్తా అన్నారు.

తన ఇష్టం మేరకు మొదట సినిమాల్లో నటిస్తా అంటే ఒప్పుకున్నా. అయితే ఆమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే వెబ్ సిరీస్‌తో సక్సెస్ అయ్యింది. తాజాగా సూర్యకాంతం చిత్రంలో నటిస్తుంది. అయితే సినిమాలు వెబ్ సిరీస్‌తో ఆమె బిజీగానే ఉంది. ఆమె సినిమాల్లోకి వచ్చే ముందు మరో రెండు మూడేళ్లలో పెళ్లి చేస్తా అని ముందే చెప్పా. ఇప్పుడు ఆ సమయం రానేవచ్చింది అందుకే మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నాం.

అయితే నాకు కుల పట్టింపులు పెద్దగా ఉండవు. అబ్బాయి మంచోడు అయి ఉండి.. తన కాళ్ల మీద తాను నిలబడి మంచి వ్యక్తిత్వం ఉన్న వాడైతే చాలు. మా కులంలో అలాంటి సంబంధం వస్తే మంచిదే.. లేదంటే వేరే కులం వ్యక్తి అయినా అభ్యతరం లేదు. కాపు కులాన్ని గౌరవిస్తానని అదే సందర్భంలో అన్ని కులాలు సమానమనేది నా అభిప్రాయం. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలనే ఆంక్షలేమీ లేవు. సినీ రంగం నుంచే కావాలనే ఆంక్షలు ఏమీ లేవు. కుటుంబ నేపథ్యం బాగుండి.. మంచి గుణం, పద్ధతైన కుర్రాడైతే చాలు. అలాంటి సంబంధం వస్తే పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాం’ అంటూ నిహారిక పెళ్లి ప్రకటన చేశారు నాగబాబు.

more updates »