లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన అనుష్క

లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన అనుష్క

ఆమధ్య వచ్చిన ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించింది. ఈ సినిమాకు ‘సైలెన్స్’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోంది. అయితే ‘భాగమతి’ తరువాత ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫొటోలేవీ బయటకు రాలేదు.

తాజాగా ఆమె లేటెస్ట్ ఫొటోలను ఫొటోగ్రాఫర్ సుందర్ రాము సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను నెటిజన్లు షేర్ చేయడమే కాకుండా.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుపు రంగు దుస్తుల్లో సముద్రం ఒడ్డున కూర్చుని ఫొటోలు తీయించుకుంది. వీటిలో అనుష్క గతంలో కంటే నాజూకుగా కనిపించడంతో ‘అనుష్క ఈజ్ బ్యాక్’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

more updates »