అర్జున్ రెడ్డి రిమేక్ 'కబీర్ సింగ్' ట్రైలర్

అర్జున్ రెడ్డి రిమేక్ 'కబీర్ సింగ్' ట్రైలర్
అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా బాక్సాఫీసులను బద్దలు చేసిన మూవీ. విజయ్ దేవరకొండను ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా అది. సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాను తెరకెక్కించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. కియరా అద్వాణీ హీరోయిన్. జూన్ 21 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. హిందీలో కూడా సందీప్ రెడ్డి వంగానే తెరకెక్కిస్తున్నారు. ఇక.. ట్రైలర్ విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డికి ఏమాత్రం తీసిపోకుండా ఉంది ట్రైలర్. అచ్చు గుద్దినట్టు అర్జున్ రెడ్డిని దింపేశారు సందీప్ రెడ్డి.
more updates »