ఆసక్తికరంగా రష్మి ‘శివరంజని’ ట్రైలర్

ఆసక్తికరంగా రష్మి ‘శివరంజని’ ట్రైలర్
ప్రముఖ నటి, యాంకర్ రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శివరంజని’. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది. కానీ, చంపింది నేను కాదు నువ్వు’ ఓ పోలీసు అధికారి నటుడు నందుతో చెబుతున్న డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి’ అన్న రష్మి డైలాగ్ తో పాటు ‘అది నీడ కాదు ఆత్మ’ అంటూ మరో ఆర్టిస్ట్ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. ఈ ట్రైలర్ లో కమెడియన్ ధన్ రాజ్ కూడా కనబడతాడు. కాగా, త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి దర్శకుడు నాగప్రభాకర్.
more updates »