రజనీ మూవీ 'దర్బార్' ఫస్టులుక్ రిలీజ్

రజనీ మూవీ 'దర్బార్' ఫస్టులుక్ రిలీజ్

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతోన్న ఫస్టు సినిమా కావడంతో, అందరిలోను ఆసక్తి వుంది. ఇక 'సర్కార్' హిట్ తరువాత మురుగదాస్ .. 'పేట' విజయం తరువాత రజనీ కలిసి చేస్తోన్న సినిమా కావడం వలన కూడా ఈ ప్రాజెక్టుపై అంతా దృష్టి పెట్టారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

'దర్బార్' అనే టైటిల్ ను సెట్ చేసుకుని వదిలిన ఫస్టు లుక్ .. రజనీ అభిమానులను ఆకట్టుకునేలా వుంది. రజనీ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. అందుకు తగినట్టుగానే ఈ పోస్టర్లో రజనీతో పాటు గన్స్ .. బుల్లెట్స్ .. పోలీస్ క్యాప్ .. పోలీస్ బెల్ట్ .. పోలీస్ డాగ్ .. కనిపిస్తున్నాయి. రజనీ డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార కనిపించనుంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

more updates »