దుమ్మురేపేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' టీజర్

దుమ్మురేపేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' టీజర్

రామ్ కథానాయకుడిగా .. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ రోజున రామ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయనకి విషెస్ తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఈ టీజర్ ను వదిలిందన్న మాట.

ఒక రకంగా ఇది రామ్ పాత్రపైనే ఫోకస్ చేస్తూ వదిలిన టీజర్ గా చెప్పుకోవాలి. మాస్ ఏరియాలో దాదాగిరి చేసే మాస్ లీడర్ శంకర్ గా ఈ సినిమాలో రామ్ కనిపిస్తాడనే విషయాన్ని ఈ టీజర్ మరోసారి స్పష్టం చేసింది. చాక్ లెట్ బాయ్ వంటి రామ్ ను మాస్ లుక్ తో చూడటం కొత్తగానే అనిపిస్తుంది. "నాతో కిరికిరంటే పోశమ్మ గుడి ముంగట పొట్టేలును గట్టేసినట్టే" అంటూ రామ్ చెప్పిన డైలాగ్, మాస్ వర్గాన్ని ఆకట్టుకునేలా వుంది

more updates »