'హిప్పీ' మూవీ ట్రైలర్ విడుదల

'హిప్పీ' మూవీ ట్రైలర్ విడుదల

కార్తికేయ కథానాయకుడిగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో 'హిప్పీ' సినిమా రూపొందుతోంది. కార్తికేయ సరసన నాయికగా దిగాంగన నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ తో కూడిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు.

రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగుతో పాటు తనకి తమిళంలోను మంచి క్రేజ్ వస్తుందని కార్తికేయ భావిస్తున్నాడు. తమిళనాట కూడా తన మార్కెట్ పెరుగుతుందని ఆశిస్తున్నాడు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా, ఆయన నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.

more updates »