మహేశ్ బాబు మంచి మనసును చూడగలిగాను: అల్లరి నరేశ్

మహేశ్ బాబు మంచి మనసును చూడగలిగాను: అల్లరి నరేశ్

మహేశ్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'మహర్షి' .. ఈ నెల 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో 'అల్లరి' నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ను గురించి తాజాగా ఆయన స్పందిస్తూ, మహేశ్ తో కలిసి నటించడం .. అది సక్సెస్ కావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నాడు.

ఈ సినిమాలో నేను మహేశ్ స్నేహితుడిగా కనిపిస్తాను. అందువలన ఆయన నన్ను ఒకటి .. రెండుసార్లు 'ఒరేయ్' అని పిలుస్తాడు. కానీ నేను మాత్రం ఆయనను 'ఒరేయ్' అని చాలాసార్లు పిలిచాను. అలా పిలవడం నాకు చాలా ఇబ్బందిని కలిగించింది. ఆ విషయాన్ని వంశీ పైడిపల్లితో చెప్పాను కూడా. స్నేహితులు అలాగే పిలుచుకుంటారనీ, మహేశ్ ఏమీ అనుకోరని ఆయన చెప్పాడు. ఈ సినిమాతో మహేశ్ మంచి మనసును దగ్గరగా చూడగలిగాను అని ఆయన చెప్పుకొచ్చాడు.

more updates »