సొంత థియేటర్లో మొదటి చిత్రం చూసిన మహేశ్

సొంత థియేటర్లో మొదటి చిత్రం చూసిన మహేశ్

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు ఇవాళ 'అవెంజర్స్: ఎండ్ గేమ్' చిత్రాన్ని వీక్షించారు. తన సొంత థియేటర్ అయిన ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్ చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మహేశ్ తన స్పందనను ట్విట్టర్ లో తెలియజేశారు. ఏఎంబీ సినిమాస్ థియేటర్ లో తాను చూసిన మొదటి చిత్రం ఇదేనని వెల్లడించారు.

'అవెంజర్స్: ఎండ్ గేమ్' చిత్రం చాలా బాగుందని, బాగా ఎంజాయ్ చేశానని వివరించారు. "థాంక్యూ ఏఎంబీ టీమ్, మీ పనితీరు అద్భుతం" అంటూ తన థియేటర్ సిబ్బందిని అభినందించారు. అంతేగాకుండా, ఏఎంబీ సినిమాస్ స్టాఫ్ తో కలిసి ఫొటోలకు పోజిచ్చారు.

మహేశ్ బాబు ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లోని గచ్చీబౌలిలో ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది కొన్ని నెలల క్రితమే ప్రారంభమైంది.

more updates »