'పటాస్' షోకి గుడ్ బాయ్ చెప్పిన శ్రీముఖి

'పటాస్' షోకి గుడ్ బాయ్ చెప్పిన శ్రీముఖి

బుల్లితెరపై సందడి చేసే ఈ తరం యాంకర్స్ లో అనసూయ .. రష్మీ తరువాత అంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్న యాంకర్ గా శ్రీముఖి కనిపిస్తుంది. శ్రీముఖి చాలా టీవీ షోలు చేసినప్పటికీ 'పటాస్' ఆమెకి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఈ షో సక్సెస్ ఫుల్ గా ఇంతకాలం రన్ కావడానికి శ్రీముఖి ఒక కారణమనే వారే ఎక్కువ. యూత్ ఫుల్ కంటెంట్ తో సాగే ఈ షోలో శ్రీముఖి చేసిన అల్లరి .. సందడి అంతా ఇంతా కాదు.

ఆమె ఈ షోను ఉత్సాహంతో పరుగులు తీయించడమే కాదు, తన గ్లామర్ తోను ఈ స్టేజ్ కి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంటున్నట్టుగా చెప్పింది. నిర్వాహకుల అనుమతితోనే తాను బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు ఒక వీడియో చేసి మరీ వదిలింది. ఈ షోలో ఆమె లేని లోటు తప్పకుండా తెలుస్తుంది. 'పటాస్' షో వేదికపై కనిపించే కొంతమంది ఆర్టిస్టులు ఈ షోకి దూరమైన సమయంలో, శ్రీముఖి ఇలా బ్రేక్ తీసుకోవడం అనుమానాలకు తావిచ్చే అవకాశం లేకపోలేదు.

more updates »