'సాహో' సినిమా కోసం హిందీ నేర్చుకుంటున్న ప్రభాస్

'సాహో' సినిమా కోసం హిందీ నేర్చుకుంటున్న ప్రభాస్

'బాహుబలి'తో ఉత్తరాది ప్రేక్షకులకు సైతం దగ్గరైన ప్రభాస్, ప్రస్తుతం 'సాహో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించగా, డబ్బింగ్ రైట్స్ ఆకర్షణీయమైన ధరకు విక్రయించబడ్డాయి. ఇక 'బాహుబలి'లో ప్రభాస్ కు హిందీలో వేరే వారిచేత డబ్బింగ్ చెప్పించారు.

ఇకపై హిందీలో డబ్బింగ్ సమస్య రాకుండా ప్రభాస్‌ సొంతంగానే డైలాగులు చెప్పాలని సిద్ధమవుతున్నారు. అయితే, హిందీలో మంచి పట్టు ఉన్నప్పటికీ, ప్రభాస్ మాట్లాడితే, దక్షిణాది యాస వినిపిస్తుంది, దీంతో ఉత్తరాది యాస వచ్చేందుకు తాను ప్రత్యేకంగా హిందీ నేర్చుకుంటున్నానని, భాషలో మరింత పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నానని ప్రభాస్ వెల్లడించారు. 'సాహో' సినిమా షూటింగ్ తుదిదశకు రావడంతో పోస్ట్ ప్రోడక్షన్ కార్యకలాపాలు సైతం ఊపందుకుంటున్నాయి. సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.

more updates »