తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు

భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక దర్శకుడిగా వంశీ పైడిపల్లికి గల ఇమేజ్ .. మహేశ్ బాబు .. పూజా హెగ్డేకి గల క్రేజ్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో పోస్టర్స్ పై కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

అలా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా 59.37 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 21.67 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. మహేశ్ బాబు కెరియర్లోనే ఇవి అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. మహేశ్ బాబు అభిమానులు కోరుకున్నట్టుగానే ఆయనకి భారీ విజయం దక్కింది.

more updates »