'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' నుంచి ఫస్టులుక్ పోస్టర్

'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' నుంచి ఫస్టులుక్ పోస్టర్

ఏ పాత్రను ఇచ్చినా అందులో ఒదిగిపోయి చేసే యువకథానాయకులలో సందీప్ కిషన్ ఒకరు. ఆయన తాజా చిత్రంగా 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' రూపొందుతోంది. హాస్య ప్రధానమైన చిత్రాలను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి నవ్వులు పూయించడంలో జి. నాగేశ్వర రెడ్డి ఒకరు. ఈ సినిమాను కూడా ఆయన తనదైన శైలిలోనే రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో సందీప్ కిషన్ కేసులు లేని లాయర్ గా నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా హన్సిక నటిస్తుండగా, మరో కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నారు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ పై సందీప్ కిషన్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ అయినా ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

more updates »