హెచ్1-బీ వీసాపై మరో సంచలన నిర్ణయం

హెచ్1-బీ వీసాపై మరో సంచలన నిర్ణయం

గతంలో హెచ్1-బీ వీసాలు జారీ విషయంలో కఠినంగా వ్యవహరించిన అమెరికా మరో అడుగు ముందుకేసి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎస్ తాను సవరించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా హెచ్1-బీ వీసా దరఖాస్తు రుసుమును పది డాలర్లు పెంచింది.

పిటిషనర్లు, ఫెడరల్ ఏజెన్సీ రెండింటికీ హెచ్1-బీ క్యాప్ ఎంపిక ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయడానికి ఈ నాన్‌ రిఫండబుల్‌ రుసుము తోడ్పడుతుందని యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్) పేర్కొంది. ఈ ప్రయత్నం హెచ్1-బీ క్యాప్ ఎంపిక ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సహాయపడుతుంది యూఎస్‌సీఐఎస్ ఇంచార్జీ డైరెక్టర్ కెన్ కుసినెల్లి తెలిపారు. ఇక హెచ్1-బీ క్యాప్ ఎంపిక ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా పెంచిన రుసుము ఉపయోగకరంగా ఉంటుందని కెన్ పేర్కొన్నారు.

more updates »