ఏపీ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్

ఏపీ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సుబ్రమణ్యంను మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీని నియమించే వరకు నీరబ్ తాత్కాలిక సీఎస్‌గా వ్యవహరిస్తారు. కాగా.. సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీ సుబ్రమణ్యం రిలీవ్ అయ్యారు. అనంతరం నీరబ్‌కు బాధ్యతలను అప్పగించారు.

more updates »