ఫంక్షన్‌హాల్‌లో పెళ్లికుమారుడు ఆత్మహత్య!

ఫంక్షన్‌హాల్‌లో పెళ్లికుమారుడు ఆత్మహత్య!

మేడ్చల్‌లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లికుమారుడు సందీప్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి ముహూర్తానికి ముందు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

ఉదయం పది గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయమే వరుడి కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. ఫంక్షన్‌ హాల్‌లోని గదిలో వరుడికి మేకప్ చేస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో ఒంటరిగా గదిలోపలి నుంచి సందీప్‌ గడియపెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి తెరవడంతో సందీప్‌ అప్పటికే ఉరికి వేసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పెళ్లిని రద్దు చేశారు. ఈ ఘటనతో ఫంక్షన్‌హాల్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

more updates »