ఆమ్లెట్‌లో గుడ్డు పెంకులొచ్చాయని మోడీకి పిర్యాదు!

ఆమ్లెట్‌లో గుడ్డు పెంకులొచ్చాయని మోడీకి పిర్యాదు!

రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్ కు ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది గుడ్డు పెంకులతో కూడిన ఆమ్లెట్‌ను వడ్డించారు. పూణే నుంచి ఢిల్లీ వెళ్తుండగా వందనకు ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్‌ లో గుడ్డు పెంకులతో కూడిన ఆమ్లెట్, ఉడకని బంగాళా దుంపల ముక్కలు, బీన్స్ దర్శనమిచ్చాయి. దీంతో విమాన సిబ్బంది తీరుపై విమర్శలు గుప్పించారు ఎంపీ. ఎంపీ ఫిర్యాదు మేరకు ఎయిర్‌ ఇండియా చర్యలు తీసుకున్నది. గతవారం పుణె-ఢిల్లీ విమానానికి సరఫరా చేసిన ఆహార పదార్థాల మొత్తం ధరను, నిర్వహణ చార్జీలను క్యాటరింగ్‌ ఏజెన్సీలే భరించాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

పూణే నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగిన మొత్తం విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో వందనా చవాన్ వెల్లడించారు. తాను విమానం ఎక్కి ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చానని, తింటుండగా దీనిలో గుడ్డు పెంకులు కూడా వచ్చాయని ఫిర్యాదు చేస్తూ, పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ పూరితో పాటు నరేంద్రమోదీ, ఎయిరిండియా సీఎండీ, పౌర విమానయాన శాఖ డైరెక్టరు జనరల్ లను ట్యాగ్ చేశారు. వడ్డించిన కూర కూడా తినేలా లేదని ఆరోపించారు. కేటరింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని సంస్థ ప్రతినిధి ధనుంజయ్ కుమార్ చెప్పారు.

more updates »