ఎస్‌బీఐ ఏటిఎంలలో 2 వేల నోట్లు బంద్

ఎస్‌బీఐ ఏటిఎంలలో 2 వేల నోట్లు బంద్

ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక ప్రకారం బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్ న్యూసే. ఇక నుంచి ఎస్‌బీఐ ఏటీఎంలలో 2 వేల రూపాయల నోట్లను అందుబాటులో ఉంచమని ప్రకటించింది. ఆర్బీఐ సూచన మేరకు అన్ని ఏటిఎంలలో నుంచి రూ.2 వేల రూపాయల క్యాసెట్లను ఎస్‌బీఐ తొలగించింది. భవిష్యత్ లో కేవలం రూ.200,100 నోట్లను మాత్రమే అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తుంది. త్వరలోనే రూ.500 నోట్లను కూడా నిలిపేయనున్నారు. 2 వేల నోట్లు ఏటిఎంలలో నుంచి తొలగించడంతో చిన్న నోట్లు మాత్రమే రానున్నాయి. దీంతో నగదు పరిమితి తగ్గే అవకాశం ఉంది. అందుకోసం లావాదేవీల పరిమితి పెంచడం కోసం ఎస్బీఐ యోచిస్తున్నట్టు సమాచారం. మెట్రో నగరాల్లో నెలకు 10 సార్లు, ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటిఎం నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఎస్బీఐ ఏటిఎంలలో అమలవుతుంది. త్వరలోనే మిగిలిన బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నాయని తెలుస్తోంది.

more updates »