ఏపీలో ఓటర్ల లెక్క తేల్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఏపీలో ఓటర్ల లెక్క తేల్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య తేలిపోయింది. ఏపీలో మొత్తం 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పుడు ఏపీలో ఓటర్ల లెక్క తేలడంతో... ఇక తేలాల్సింది 2019 ఎన్నికల్లో విజయం మాత్రమే అంటున్నారు రాజకీయ పండితులు.

ఇక జెండర్ ప్రకారం చుస్తే... ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్లలో పురుషుల సంఖ్య 1,83,24,588 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్ల సంఖ్య 1,86,04,742 గా ఉంది. ఇక థర్డ్ జెండర్ కు చెందిన ఓటర్లు 3,761 గా లెక్క తేలింది. ఈ లెక్క ప్రకారం ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం. ఇక జిల్లాల వారీగా ఓటర్ల లెక్క చుస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 40,13,770 మంది ఓటర్లు ఉన్నారు. ఇక విజయనగరం జిల్లా 1,7,33,667 మంది ఓటర్లతో అత్యల్ప ఓటర్లు ఉన్న జిల్లాగా నమోదయ్యింది.

more updates »