అబ్దుల్ కలాం అవార్డుల పై జగన్ కీలక నిర్ణయం!

అబ్దుల్ కలాం అవార్డుల పై జగన్ కీలక నిర్ణయం!

అబ్దుల్ కలాం అవార్డుల పై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్దులకే "డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్" అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాలని జగన్ సర్కార్ ఆలోచిస్తుంది..

పదో తరగతి ఫలితాల్లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు అందించే ఈ అవార్డులు ఇస్తారు. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ఇస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతోపాటు అక్కడ చదువుకునే పదో తరగతి విద్యార్థులను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతిభ అవార్డులను వారికే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. . ప్రతిభ అవార్డుకు ఎంపికైన విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో రూ. 20 వేల చొప్పున నగదు జమకానుంది. ట్యాబ్, మెడల్, సర్టిఫికెట్, విద్యార్థి కెరీర్‌కు ఉపయోగపడే పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వనున్నారు. పదో తరగతి చదివే ప్రతి విద్యార్థి తాను ప్రతిభ అవార్డుకు ఎంపిక కావాలని కష్టపడుతుంటాడు. ప్రతిభ అవార్డును గర్వంగా అందుకొని తాను నివసించే ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుంటారు.

more updates »