ఏపీలోని ఐదు చోట్ల కొనసాగుతున్న రీపోలింగ్‌

ఏపీలోని ఐదు చోట్ల కొనసాగుతున్న రీపోలింగ్‌

గుంటూరు: ఏపీలోని ఐదు చోట్ల రీపోలింగ్‌ కొనసాగుతోంది. నరసరావుపేట కేసానుపల్లిలో ఇప్పటివరకు 13.32శాతం పోలింగ్‌ నమోదైంది. గుంటూరు పశ్చిమ సెగ్మెంట్‌లోని నల్లచెరువులో 19.87శాతం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతలలో 9.53శాతం, నెల్లూరు జిల్లా కోవూరు ఇసుకపాలెంలో 13.28శాతం, సూళ్లూరుపేట అటకానితిప్పలో 30.47శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 5,064మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1200మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలో ఐదు చోట్ల నేడు జరిగే రీపోలింగ్‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ‌త అనుభ‌వాల దృష్ట్యా అధికారులు, భ‌ద్ర‌త‌ను భారీగానే పెంచింది. అన్ని బూత్‌ల వ‌ద్ద పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జ‌రిపారు. ఈవీఎలు మొరాయిస్తే వెంటనే అద‌న‌పు ఈవీఎంల‌ను అందుబాటులో ఉంచేలా అధికారులను ఈసీ ఆదేశించింది.

more updates »